Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

సౌకర్యాలు మృగ్యం

Girls dormitory in the debris

శిథిలావస్థలో బాలికల వసతి గృహం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాలికలు

మనతెలంగాణ/మంథని రూరల్: చదువుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నా ఆర్థికస్థోమత లేని పేదింటి ఆడ బిడ్డలకు చేయూతనిచ్చేందుకు నెలకొల్పిన సంక్షేమ వసతిగృహాలు అధికారుల నిర్లక్షానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. కనీస సౌకర్యాల లేమితో విద్యార్థినులు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు దుప్పట్లు, తువాళ్ళు, తదితర సామాగ్రితో పాటు కంచాలు, తాగడానికి గ్లాసులు పంపిణి చేయలేదని విద్యార్థినిల తల్లిదండ్రుల ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమా..? లేక అధికారుల నిర్లక్షమా తెలియదు కాని మంథని ఎస్సి బాలికల వసతి గృహంలో బాలికలు నానా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. మంథనిలోని ఎస్సి బాలికల వసతి గృహంలో 70 మంది విద్యార్థినిలు ఉన్నారు. వీరంతా పేదింటి ఆడబిడ్డలే రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకొనలేని పరిస్థితిలో ఈ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ  పాఠశాలల్లో విద్యాను కోనసాగిస్తున్నారు. ఈ బాలకల వసతి గృహం నిర్మించి నాల్గు దశాబ్దాలు దాటడంతో శిధిలావస్థుకు చేరుకుంది. గత యేడాది మరమత్తులు చేసిన మళ్ళీ పగుళ్ళు ఏర్పాడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి చోటుచేసుకుంది. గోడలు బీటలు వారాయి. పైకప్పు పెచ్చులేచ్చుతుంది. మరుగుదొడ్లు, స్నానాల గదుల తులపులు పగిళిపోయాయి. స్నానాలు, మరుగు దొడ్లు గదులల్లో విద్యుత్ దీపాలులేవు, బాలికల వసతి గృహం చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచేదారం, గడ్డితో దర్శనమిస్తుంది. గత్యంతరం లేకపోవడంతో బాలికలు ఇందులో చదువులను సాగిస్తున్నారు. వర్షం కురిస్తే నీరు గదుల్లోకి చేరి రాత్రివేళ నిద్రకు దూరమైన సందర్భలున్నాయని విద్యార్థీనులు వాపోతున్నారు. వర్షాలు భాగ కురిస్త్తే నీరంత వసతి గృహంలో నిలిచి, బకేట్లతో ఎత్తిపోసిన రోజులున్నాయి. మరుగు దొడ్లు పరిస్థితి చెప్పానవసరంలేదు, విద్యార్థీనులకు సరిపడలేవని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోని హాస్టల్ అవరణలో లక్షలాధి రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు ఉపయోగంలోకి రాకపోవడంతో నిరూపయోగంగా మారాయి. మరోవైపు గదుల్లో విద్యుత్తు సరిగలేకపోగ ఫ్యాన్లు సక్రమంగా తిరుగక, దోమల బెడదలో బాలికలు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. బాలికల వసతి గృహంలో మరుగు రోడ్లు,స్నానాల గదులను మెరుగుపర్చి పాడైన పరికరాలను మరమత్తులు చేసి నూతన భావనానికి అధికారులు, ప్రభుత్వం చోరువచూపాలని విద్యార్థినిలు కోరుతున్నారు.

Comments

comments