Home ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అమ్మకం ముఠా ఆటకట్టు

ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అమ్మకం ముఠా ఆటకట్టు

ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అమ్మకం ముఠా ఆటకట్టు

Neglected lonely childమన తెలంగాణ/ఇంద్రవెల్లి : గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పొరుగు రాష్ట్రాలకు అమ్ముతున్న ముఠా ఆటకట్టు అయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్‌సింగ్ తండాకు చెందిన నిస్తే హర్‌సింగ్, కెస్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కెస్లా గూడ(జి) చిత్రుగూడ గ్రామానికి చెందిన మడావి భీంరావు, దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిప్రి గ్రామానికి చెందిన చహకటి జంగులు ముగ్గురు ముఠాగా ఏర్పడి అమ్మా యిలను అమ్మేందుకు పన్నాగం వేశారు. ఇంద్రవెల్లి మండ లంలోని సమక్క గ్రామానికి చెందిన తగిరే అమృత్, ఉట్నూర్ మండలం సాలెవాడకు చెందిన మడావి లలిత, బజార్‌హత్నూర్ మండలం ఎస్లాపూర్‌కు చెందిన తగిరే సంగీత, నేరడిగొండ మండలం రాజుల్‌గూడకు చెందిన పిట్టి, నార్నూర్‌కు చెందిన మడావిలను రాజస్థాన్‌లో అమ్మేందుకు సిద్ధమై అక్కడికి పంపిం చారు.

girl_manatelangana1వీరిని ఒకొక్కరికి లక్షా 50 వేల రూపాయల చొప్పున అమ్మేశారు. అయితే 7 నెలల క్రితం ఉట్నూర్ మండలం సాలె గూడ (బి)కి చెందిన మడావి లలిత తప్పిపోయినట్లు ప్రచారం సాగింది. 15 రోజుల క్రితం లలిత తన అన్న హన్మంత్‌రావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అక్కడ తన పరిస్థితి బాగాలేదని, తనను కిడ్నాప్ చేసి రాజస్థాన్‌కు విక్రయించారని తెలిపింది. అయితే హన్మంత్‌రావు గిరిజన సంఘాలకు కిడ్నాప్ వ్యవహారం గురించి చెప్పడంతో గిరిజన సంఘాలు సంఘటితమై ముగ్గురి ముఠాను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్‌పి వెంకటేశ్వర్ తెలిపారు. కాగా, నలుగురు అమ్మాయిల వివరాలు తెలియ రాలేదు. నాలుగైదు ఏళ్ళుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు నింది తులు పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంత యువతులను అమ్ముతున్న ముగ్గురిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘం జిల్లా అద్యక్షురాలు రేఖ గంగా సాగర్ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.