Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పెళ్లి కొడుకుపై దాడి… వధువును ఎత్తుకెళ్లారు…!

IMAGE

నిజామాబాద్: పెళ్లి కొడుకుపై దాడి చేసి, పెళ్లి కూతురిని ఆమె బంధువులు ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మేజర్ అయిన ప్రాణదీప్‌, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకోడానికి వెళ్లారు. ఐదు నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువులు ఇద్దరిని చితకాబాదారు. అనంతరం సౌజన్యను బైక్ పై తీసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము మేజర్లమని, ఇద్దరం ఇష్టపడి పెండ్లి చేసుకుంటుండగా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. కాగా ఈ ఘటన జరుగుతుండగా స్థానికులు అడ్డుపడకుండా వీడియోలు తీయడం గమనార్హం.

Comments

comments