Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

ఒత్తిడికి లోనైతే ఏమీ సాధించలేం..

CBSE

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌సీ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే ముందున్నారు. మొదటి మూడు స్థానాల్లోనూ తమ సత్తా చాటుకున్నారు.  ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులు సాధించి మరో ఆరుగురు విద్యార్థినులతో సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించింది.  మేఘన విషయానికొస్తే… ఆమె టాపర్‌గా నిలవడానికి ప్రత్యేకంగా ట్యూషన్‌కి కూడా వెళ్లలేదు. మంచి మార్కులు వస్తాయని ఊహించింది. కానీ మొదటిస్థానంలో నిలుస్తుందనుకోలేదట. ఏడాదంతా కష్టపడి చదివినందుకు తన కల నిజమైందని సంతోషాన్ని వ్యక్తంచేస్తోంది.  హార్డవర్క్ చేయడంతోపాటు నిలకడ, నిబద్ధత చాలా ముఖ్యం. ఒత్తిడికి లోనైతే ఏమీ సాధించలేం అంటూ తన విజయరహస్యాన్ని చెబుతోంది. హ్యుమానిటీస్ అభ్యసించిన తాను సైకాలజిస్ట్ కావాలనుకుంటున్నట్లు తెలిపింది.

Comments

comments