Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘గీత గోవిందం’ ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్!

vijay

హైదరాబాద్ :యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గీత గోవిందం’. ఈ చిత్రాన్నిజిఎ2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల విడుదలైన ‘ఇంకేం కావాలే’ సాంగ్ యూత్ ను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూట్యూబ్‌లో ఈ పాటను ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా వీక్షించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. కాగా ఈనెల 29న హైదరాబాద్‌లో నిర్వహించే ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ విషయాన్నితెలుపుతూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments