Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గిన్నిస్ రికార్డు సాధించిన గీతం విద్యార్థిని

Guinness

మనతెలంగాణ/పటాన్‌చెరు : కాగితాన్ని బొమ్మలుగా మలిచిన గీతం విద్యార్థిని శివాలిని గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. గిన్నిస్ రికార్డు సాధించిన శివాలినిని గురువారం గీతం ప్రో వైస్ ఛాన్సిలర్ శివప్రసాద్ అభినందించారు. గీతం విశ్వ విద్యాలయంలో బీటెక్ (సీఎస్‌ఈ) మొదటి సంవత్సరం చదువుతున్న శివాలిని అర్ట్ టీచర్ తల్లి కవితతో కలిసి కాగితాన్ని బొమ్మలుగా (1251) చేసి కొలువు తీర్చినందుకు గాను గిన్నిస్ రికార్డువారు ఆమె రికార్డును నమోదు చేసి సర్టిఫికేట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గీతం ప్రో వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచుకుని రికార్డులను సొం తం చేసుకోవచ్చని తెలిపారు. తమ విద్యార్థులకు ప్రత్యే కంగా శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. శివాలిని, ఆమె తల్లి కవితలను ప్రత్యేకంగా అభినం దించారు. వారిని అభినందించిన వారిలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంజయ్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ రామారావు, హెచ్‌బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ లక్ష్మణ్‌కుమార్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, వివిధ విభాగాధిపతులు, అధ్యాప కులు విద్యార్థులు ఉన్నారు.

Comments

comments