Home రాష్ట్ర వార్తలు ౩ టిఎంసిలు ఇవ్వండి

౩ టిఎంసిలు ఇవ్వండి

నారాయణపూర్ నుంచి జూరాలకు నీటి విడుదల కోరుతూ కర్ణాటక ఇరిగేషన్ మంత్రికి హరీశ్‌రావు ఫోన్

harish-rapహైదరాబాద్:  మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ డ్యాం నుంచి జూరా లకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి ఎంబి పాటిల్‌తో మంత్రి టి.హరీశ్‌రావు మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తికి కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించి నట్టు తెలిసింది. మరో రెండు మూడు రోజు ల్లోనే ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎంబి పాటిల్, మంత్రి హరీశ్‌రావుకు హామీనిచ్చారు. మూడు టిఎంసిల నీటిని విడుదల చేయాలని ఇటీవలే మంత్రి హరీశ్ కోరిన సంగతి తెలిసిందే. ఆర్‌డిఎస్ ఆధునీకరణ పనులపై చర్చించ డానికి వెళ్లిన సమయంలో నీటి విడుదలపై మంత్రి చర్చించారు.