Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రూ. 2,121 కోట్లు ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్ ఇండియా

airplane

ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రూ. 2,121 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిం ది. పలు సంస్థకు చెల్లింపుల నిమిత్తం ఈ నిధులను ఇవ్వాలని కోరినట్టు సమాచారం. బ్యాంకులకు రూ.1800 కోట్లు ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంది. ఎయిర్ ఇండియాలో 76 శాతం విక్రయించాలనే ప్రభుత్వం ప్రయత్నం విఫలం కావడంతో రుణాలు ఇచ్చిన సంస్థలు చెల్లింపు చేయాలని కో రాయి. ఈమేరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వాలని కోరింది. అన్ని రుణాలు చెల్లించిన తర్వాత వచ్చే 7 నుంచి 10 రోజుల్లో అదనపు ఈక్విటీని విమాన సంస్థ అందుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడా ది సంస్థ ఇప్పటికే 650 కోట్ల రూపాయిలను అం దుకుంది. కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ మార్గాన్ని ఎంచుకుంది. కేంద్ర ప్రభుత్వం చేసి న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కేంద్రం ఆలోచన చేస్తోంది. నిధులు లేక రోజువారీ కార్యకలాపాలు కూడా నిర్వహించడం ఎయిర్ ఇండియాలో కష్టంగా మారింది. మే 31తో ముగిసిన బిడ్డింగ్‌లో ఏ బిడ్డర్‌ను కూడా ఎయిర్ ఇండియా ఆకట్టుకోలేకపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ఏ ఒక్క బిడ్డర్  కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.  ఇంధన ధరలు పెరుగుతుండటంతో, ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ క్లిష్టతరమవుతుందని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు.

Comments

comments