Home జాతీయ వార్తలు ఎపికి మద్దతు ఇవ్వండి : చంద్రబాబు

ఎపికి మద్దతు ఇవ్వండి : చంద్రబాబు

I was the First Person to Oppose Triple Talaq Bill Says Chandrababu Naidu

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఎపి ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జాతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంగళవారం పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్ల వద్ద నమస్కరించి పార్లమెంట్‌లోకి వెళ్లారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పలువురు జాతీయ నేతలతో ఆయన భేటీ అయ్యారు. జాతీయ నేతలు శరద్ పవార్, వేణుగోపాల్, ఎన్‌సిపి నేతలు అబ్దుల్లా, తారిక్ అన్వర్, అనుప్రియ పటేల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులతో ఆయన మాట్లాడారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను ఆయన వారికి అందించారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ఎపి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎపి హక్కుల సాధనలో భవిష్యత్‌లో కూడా తమకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు జాతీయ నేతలను కోరారు.

Give Support to AP People : Chandrababu