Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రైతుల ఆత్మహత్యలపై  నివేదికలు  ఇవ్వండి

HIGHCOURTరెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు
రైతుల ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై నివేదికలు సమర్పిం చాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వాలకు హైదరాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభు త్వాలు తమతమ సంబంధిత రాష్ట్రాలలో తీసు కున్న చర్యలపై ఇచ్చే నివేదిక సమగ్రంగా ఉం డాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను ఇందులో పొందుపర్చాలని తెలిపారు. వ్యవసాయ జనచైతన్య సమితి, పాకాలా శ్రీహరిరావు, ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థా నం స్పందించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యల నివారణకు ఎలాం టి సమగ్ర చర్యలూ చేపట్టలేదని, ఈ విషయంలో చేతకానితనం ప్రదర్శించాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తెలంగాణ తరఫున ప్రత్యేక న్యాయవాది ఎస్ శరత్‌కమార్ తమ వివరణ ఇస్తూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని, దీని కి సంబంధించి తగు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఈ సమాధానంతో పిటిష నర్ల తరఫు న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రైవేట్ రుణదాతల బారిన పడి రైతులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభు త్వం సరైన విధంగా ఆదుకోకపోవడం వల్లనే రైతులు రుణాలు తీసుకుని తీర్చలేకపో తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వివరణలో తాము రైతుల ఆత్మ హత్యల నివారణకు ఓ కమిటీ వేశామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో రైతుల కమిషన్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల వివరాలను పొందుపర్చేందుకు సమయం కావా లని న్యాయవాది కోరారు. ఈ దశలో ధర్మాసనం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసి, ఆత్మహత్యలు, నివారణ చర్యలపై నివేదికలకు ఆదేశించింది.

Comments

comments