Search
Saturday 22 September 2018
  • :
  • :

ఉచిత ఎరువుల పంపిణీ విప్లవాత్మక నిర్ణయం : జూపల్లి

Jupally-Krishna-Rao

హైదరాబాద్ : తెలంగాణ రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఏ ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ తీసుకోలేదని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల పంపిణీ నిర్ణయాన్ని స్వాగతించకుండా, ప్రతిపక్షాలు మతిభ్రమించనట్లు మాట్లతున్నాయని మండిపడ్డారు. ఈ నిర్ణయం ఎన్నికల సమయంలో తీసుకున్నది కాదని, ఎన్నికల సమయంలోనే ప్రజల గురించి మాట్లాడే తత్వం కాంగ్రెస్ నాయకులదని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం తమదని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదమని, వారి ఆలోచనలు కాపీ కొట్టాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్ని అమలైతే.. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కస్థానం కూడా దక్కదని, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ఉందని అన్నారు.

Comments

comments