Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఐదు గంటల్లోనే టీజర్‌కు 20లక్షల వ్యూస్!

SPYDER

మహేశ్‌బాబు హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌విఆర్ సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘స్పైడర్’.  మహేశ్, మురుగదాస్ కాబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. విడుదలైన ఐదు గంటల్లోనే టీజర్ 20 లక్షల వ్యూస్‌ను క్రాస్ చేయడమే కాకుండా ఒక లక్షా 20 వేల లైక్స్ సాధించిందంటే ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో రూపొందుతున్న ఈ చిత్రం మహేశ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మా తలు సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీః సంతోష్ శివన్, ఎడిటింగ్‌ః శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్‌ః పీటర్ హెయిన్స్.

Comments

comments