Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీ పగ్గాలు…

dewid-varner

న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్… ప్రస్తుతం గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. అతను విన్నిపెగ్ హాక్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డ్వేన్ బ్రావో టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఆ జట్టు ఆటగాడు వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడంతో అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అతనిపై భరోసా ఉంచారు. కెప్టెన్సీ విషయంలో డేవిడ్ వార్నర్ మంచి నాయకుడు. ఐపిఎల్‌లో అతని నాయకత్వ లక్షణాలను గమనించానని కోచ్ చెప్పారు. అతనికున్న సామర్థ్యాలను ఉపయోగించి ఉత్తమ ప్రదర్శనను అందిస్తాడని యూనిస్ పేర్కొన్నారు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో వార్నర్ వరుసగా 1, 4, 1 స్కోరు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

Comments

comments