Home కరీంనగర్ ఘనంగాక్రిస్మస్ వేడుకలు

ఘనంగాక్రిస్మస్ వేడుకలు

church

మన తెలంగాణ/కరీంనగర్ టౌన్ ః నగరంలోని క్రిస్టియన్ కాలనీ, సిఎస్‌ఐ చర్చిలలో సోమవారం క్రిస్టమస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్రిస్టియన్ సోదరులను కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితో పాటు కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మన్ రావు, మూమైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్భర్ హుస్సేన్ లు కూడ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
మానకొండూర్ ః యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మం డలంలోని కొండపల్కల చర్చిలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడు కల్లో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. క్రిస్‌మస్ పండగ సందర్భంగా చర్చిలో ఫాస్టర్ జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. పలువురు మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి మాతంగి లింగయ్య, గ్రామ సర్పంచ్ కొరిమి పితాంబర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెపల్లి నగేష్, జడ్పిటీసి సుగుణాకర్, ఎంపిటిసి సభ్యుడు జనగామ శంకర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు శాతరాజు యాదగిరి, సింగిల్‌విండో డైరెక్టర్ కడారి ప్రభాకర్, క్రైస్తవులు పాల్గొన్నారు.
మంథనిరూరల్ ః ఏసుక్రీస్తును తమ హృదయంలో చేర్చుకొని ఆయన నడిచిన సన్మార్గంలో ప్రయాణించి జీవించినప్పుడే అసలైన క్రైస్తవుడని మంథని మండలంలోని వివిధ చర్చిల ఫాధర్‌లు , ఫాస్టర్లు పేర్కొన్నారు. ఏసుక్రీస్తు జన్మించిన శుభదినాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరపుకున్నారు. మండలంలోని సూరయ్యపల్లిలో గల ఆర్‌సిఎం చర్చి, సిరిపురంలోని దుబ్బపల్లిలోని శ్రీధర్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో పాటు క్రైస్తవ సొదరులు వేడుకలను నిర్వహించారు. అడవిసోమన్‌పల్లి, సూరయ్యపల్లి, ఎక్లాస్‌పూర్, ధర్మారం, గుమ్మునూర్, గ్రామాలలోని చర్చిలలో క్రైస్తవులు భక్తి శ్రద్ధ్దలతో ఏసుక్రీస్తును స్మృతించి కేక్‌ను కట్ చేసి స్వీట్లను పంచుకొని ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని ఆర్‌సిఎం చర్చికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మంథని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గ్గొని శుభాకాంక్షలు తెలిపారు. సిరిపురం చర్చిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంథని సత్యం, మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణగౌడ్, బొంకురి రామస్వామి, రవి, జాఫర్‌పాషా, చంద్రమోహన్, గొటికార్ కిషన్, జాని, బాబా, బీముని లింగయ్య, పాస్టర్ ఇబ్రహింలతో పాటు పలు చర్చిల క్రైస్తవులు పాల్గ్గొన్నారు.
మెట్‌పల్లి ః డివిజన్ కేంద్రంతో పాటు మెట్‌పల్లి, ఇబ్రంహిపట్నం. మల్లాపూర్ మండల్లాలోని పలు చర్చిలో కైస్రవ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు, క్రిస్మస్ కేకులను కట్ చేసిపాస్టర్లలు ప్రత్యెక పార్థనలు నిర్వహించియోసుప్రభువు సందేశాన్నిచదివి విని పించారు, చేశారు, అనంతరం పూష్పగుచ్చలుఅందజేసి. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గౌతం , ఎలియామింగో, సాల్మన్‌రాజ్, సామిల్ నాయక్, బలిపిఠం, గిద్యోన్, అపోస్థల్, క్రైస్తవ సోదరసోదరిమణులు తదితరులు పాల్గ్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్ ః హుజూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా క్రిస్మస్ సం బరాలు సోమవారం అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా రంగాపూర్ గ్రామంలోని న్యూలైఫ్ జీసీస్ ఇన్ చర్చిలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హజరై వేడుకల్గొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హాయంలో పండుగల నిధులు కేటాయించేది కాదన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పండుగకు గౌరవం లభిస్తుందన్నారు. క్రీస్మస్ పండుగ సందర్భంగా నిరుపేద క్రైస్తవ సోదరులకు ఉచితంగా బట్టలను పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ నెలసన్, క్రైస్తవ సోదరులు తదితరులు ఉన్నారు.
మంథని ః మంథని నియోజకవర్గ కేంద్రంలో సోమవారం క్రిస్‌మస్ సంబ రాలను ఘనంగా జరుపుకున్నారు. మంథని పట్టణంలోని సియోన్ ప్రార్థన మందిరంలో క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్న మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు క్రిస్‌మస్ కేక్‌ను కట్ చేసి చిన్నారులను తినిపించారు. అలాగే బైబిల్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో అంకరి కుమార్‌తో పాటు ఫాస్టర్లు, అధిక సంఖ్యలో క్రిస్టియన్లు పాల్గొన్నారు. మంథని మండల కాంగ్రెస్ నాయకులు క్రిస్‌మస్ సందర్భంగా చర్చికి వెళ్లి క్రిస్టియన్ సోదరీ, సోదరమణులకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, సెగ్గం రాజేష్, నూకల బానయ్య, పేరవేన లింగయ్య, మంథని సత్యం, ఆకుల శ్రీను, కాసిపేట బాపు, కిషన్‌జీ, మంథని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ ః మండలం లోని రాజారాంపల్లి చర్చి లో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రభుత్వచీఫ్‌విప్ ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పర్వదినం వేడుకల్లో ముఖ్యతిథిగా ప్రభుత్వచీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరి ,సోదరులకు క్రిస్మస్ పండుగ శుభా కాంక్షలు తెలియజేశారు . అనంతరం కేక్ ను కట్ చేసి చిన్నారుల కు అందజేశారు . పండగ సందర్భంగా క్రైస్తవులకు దుస్తుల పంపిణీ జేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల శాఖ అద్యక్షులు మూగల సత్యం ,టిఆర్‌ఎస్వి జిల్లా కో కన్వినర్ రామడుగు రాజేష్ ,రాజరాంపల్లి సర్పంచ్ ఎలేటి సత్యనారాయణ రెడ్డి , ఎంపిటిసి మల్లేశం, మాజీ సర్పంచ్ మల్లేశం, వెల్గటూర్ ఎయంసి వైచెర్మేన్ పడి దం నారాయణ , నాయకులు చక్రపాణీ, చంద్రారెడ్డి తదితరులు పాల్గ్గొన్నారు.
జ్యోతినగర్ ః ఎన్టీపీసీ పరిధిలోని పలు కాలనీల్లోని చర్చిల్లో క్రిస్మస్ పండుగ వేడుకలను సోమవారం క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక 4వ డివిజన్ పరిధిలో గల చర్చికి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొని కేక్‌కట్ చేసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రత్యేకతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సావిత్రి, కోదాటి ప్రవీణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే స్థానిక పిటిఎస్ కాలనీలోని చర్చిలో పాస్టర్ల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీకి చెందిన పలువురు క్రైస్తవులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రార్థ్ధనలు చేశారు.
మానకొండూర్ ః యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాలలో ఉన్న చర్చీలలో సోమవారం క్రిస్‌మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదరీ, సోదరులు క్రిస్‌మస్ పండగను పురస్కరించుకుని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెల్ది గ్రామ ంలో ఉన్న చర్చిలో ప్రముఖ వైద్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ నేత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ కవ్వంపల్లి అనురాధ దంపతులు పాల్గొన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ, అనురాధ చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే మానకొండూర్, గంగిపల్లి, చెంజర్ల, దేవంపల్లి, పచ్చునూర్ తదితర గ్రామాలలోని చర్చీల్లో క్రిస్‌మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదర, సోదరీమణులు కేక్‌లను కట్ చేసి పంచారు. వెల్దిలో జరిగిన క్రిస్‌మస్ వేడుకల్లో చర్చీ ఫాస్టర్ దేవయ్య, గుజ్జ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు రంగు సంపత్, బక్కారెడ్డి, జంగం అజయ్, గడమల్ల అజయ్, మాశం ప్రవీణ్, మునిగాల శ్రీనివాస్, రంగు హరీష్ పాల్గొన్నారు.
పెద్దపల్లి ః ఎసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు క్రిస్‌మస్ పండగను సొమవారం పెద్దపల్లిలో అత్యంత భక్తి శ్రద్దలతోజరుపుకున్నారు. చర్చీలతోపాటుక్రైస్తవులు తమ ఇళ్ల వద్ద క్రిస్‌మస్ ట్రీలను, క్రీస్తు జన్మ వృత్తాంతరాన్ని తెలిపే అలంకరణలను,పండుగ చిహ్నాలను ఎర్పాటు చేసి వాటిని విద్యుద్ దీపాలతో అలంకరించడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయమే ముస్తాబైన క్రైస్తవ సోదరులు పిల్లా పాపలతో కలిసి చర్చీలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రిష్టియన్ కాలనిలోని భేథాల్ చర్చ్, బండారి కుంటలోని హెబ్రోన్ చర్చ్, మొగల్ పురాలోని సెయింట్ ఫాల్ చర్చ్, చీకురాయి రోడ్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ లతో పాటు పెద్దపల్లి పట్టణంలోని ఇతర చర్చీలన్ని క్రైస్తవ భక్తులతో కిటకిటలాడాయి. క్రీస్తు బోధనలను చర్చి ఫాదర్‌లు తమ ప్రత్యేక సందేశంలో తెలుపగా భక్తులు భక్తి శ్రద్దలతో ఆలకించారు. ఈ సందర్భంగా పలు చర్చీలలో ప్రత్యేకంగా అన్నదానాలను నిర్వహించడంతో పాటు, స్వీట్లు, పండ్లు పంచి పెట్టారు. పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి,మాజి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు, గుజ్జుల రామకృష్ణా రెడ్డి, పెద్దపల్లి నగర పంచాయితి చైర్మెన్ ఎలువాక రాజయ్యతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పలు చర్చీలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని,క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.