Home కుమ్రం భీం ఆసిఫాబాద్ సంక్షేమ పథకాలతో ముందుకు

సంక్షేమ పథకాలతో ముందుకు

Asifabad

ఆసిఫాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల తో భీం జిల్లా అభివృద్దికి తోడ్పాడుదామని జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. 68వ గణతంత్ర దినోత్సవాల వేడుకలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని  పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలలో మిషన్‌కాకతీయ మిషన్ భగీరథ హారితహార పథకాన్ని, కళ్యాణలక్ష్మి, షాదిము భారక్ పథకం గ్రామీణ అభివృద్ది శాఖ,వ్యవసాయ శాఖ, ఉద్యానవశాఖ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్దం, వైద్యఆరోగ్యశాఖ,విద్యాశాఖ,దళిత బస్తీ పథకం,గిరిజనసంక్షేమ శాఖ,మైనార్టీ సంక్షేమం,పరిశ్రమాల శాఖ,జిల్లా పంచాయతీ విభాగం,పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, పౌర సరఫరాల శాఖ,   మహిళ శిశుసంక్షేమశాఖ,మార్కెటింగ్ శాఖ, ఉపాధి కల్పన శాఖ,ఎక్సైజ్,పోలీస్ శాంతిభద్రతలు ప్రభుత్వ పథకాల పై అందిస్తున్న సేవలను ఆయన కొనియా డారు.

జిల్లాలో మిషన్‌కాకతీయపథకం ద్వారా ఎరువు లను పునరుద్దరించి భూగర్భజలాలు పెంచి రైతులను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే జిల్లాలో 15 మండలాలలో 5 వేల 952 చేతి పంపులు,876 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయని ఈ మిషన్ భగీరథ మొదటిదశలో 115 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల ను ఫిబ్రవరి నెలలోపు పూర్తి అవుతాయని అన్నారు. రెండవ దశలో 1650 కోట్ల వ్యయంతో పనులు కొన సాగుతున్నాయన్నారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హారితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1కోటి 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు 957 ధరఖాస్తులు వచ్చాయని వీటిలో 732 ధరఖాస్తులను మంజూరు చేసి 3 కోట్ల 73 లక్షల రూపాయలను లబ్ది దారులకు అందిచడం జరిగిందన్నారు.

అలాగే ఉపాధి హామి పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సంవ త్సరానికి వంద రోజుల పని దినాలు కల్పించాలనే లక్షంతో జిల్లాలో ఇప్పటి వరకు 15 మండలాలలో ఒక లక్ష 50వేల జాబ్‌కార్డులను జారీ చేసి 68 వేల 897 కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరిగిం దన్నారు. అలాగే జిల్లాగ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా మార్చేందుకుఆసిఫాబాద్ మండలం లోని చిర్రకుంట గ్రామానికి 130 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రాతిపదన పంపిచడం జరిగిందన్నారు. జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకురెండు పడకల నిర్మా ణం కోసం 750 ఇండ్లు మంజూరు అయ్యయని వీటిని త్వరలోనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకుం టామన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ పథకాలనుఇప్పటి వరకు జిల్లాలో చేసినఅభివృద్ది పనులకు ఆయన వివరించారు. అనంతరం పట్టణం లోని పలు పాఠశాల విద్యార్దులు సాంస్కృతిక కార్యక్ర మాలు చేపట్టి అందరిని అలరించారు. అనంతరం ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను శకటాల ద్వారా రూపొందించారు. అనంతరంజిల్లాలో ఉత్తమ సేవలుఅందిస్తున్న 200 మందికి అవార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సన్‌ప్రిత్‌సింగ్,ఎమ్మెల్సీ పురా ణం సతీష్‌కుమార్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి,కోనేరు కోనప్ప,మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య,జిల్లా జడ్జీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, విద్యార్దులు,ప్రజలు అధిక సంఖ్య లో హాజరైయ్యారు.