Home జాతీయ వార్తలు గోవా సిఎం ఆరోగ్య పరిస్థితి విషమం

గోవా సిఎం ఆరోగ్య పరిస్థితి విషమం

 

పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బిజెపి చెందిన ప్రముఖులు గోవాకు బయలుదేరారు. గోవాలో రాజకీయాలను పరిశీలించేందుకు ఇద్దరిని బిజెపి పంపింది. బిజెపి ఎంఎల్ఎలు, నాయకులు రాష్ట్రంలోని ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి నిలేష్ కాబ్రాల్ తెలిపారు. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, పరిపాలన బాగా నడస్తోందన్నారు.

పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడమేకాకుండా శాసన సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న తమని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గోవా శాసన సభలో 40 సభ్యులు ఉండగా ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజీనామా చేయగా మరో ఎంఎల్ఎ డిసౌజా కన్నుమూశారు. ప్రస్తుతం సభలో 37 మంది ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 19 మంది ఎంఎల్ఎలు అవసరం ఉంది. కానీ బిజెపి 13 మంది ఉండగా ఆ పార్టీకి గోవా ఫార్వార్డ్ పార్టీ, ఎంజీపీ, ఎన్సీపీ, స్వతంత్ అభ్యర్థి మద్దతు ఇస్తున్నాయి. 

 

Goa CM Manohar Parrikar Critical