Home జాతీయ వార్తలు విశ్వాస పరీక్షలో నెగ్గిన గోవా సిఎం

విశ్వాస పరీక్షలో నెగ్గిన గోవా సిఎం

Pramodsawantపనాజి : గోవా సిఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్‌ సావంత్ బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయనకు అనుకూలంగా 20 మంది ఎంఎల్ఎలు ఓటేశారు. దివంగత సిఎం మనోహర్ పారికర్ మరణంతో రాష్ట్రంలో  రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పారికర్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్ఎల మరణం, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఎల రాజీనామాతో ప్రస్తుతం సభలో 36 మంది ఎంఎల్ఎలు మాత్రమే ఉన్నారు.  కాంగ్రెస్ నుంచి 14 మంది ఎంఎల్ఎలు ఉన్నారు. తమకు చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల మద్దతు ఉన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటే చేసే అవకాశం తమకు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్ మృదులా సిన్హాను కోరింది. దీంతో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ కొత్త సిఎం ప్రమోద్ సావంత్ ను ఆదేశించింది. దీంతో అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో 20మంది ఎంఎల్ఎల మద్దతుతో  ఆయన నెగ్గారు.

Goa CM Won the Trust Test in Assembly