Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఢిల్లీ ఎయిమ్స్‌లో గోవా మంత్రివర్గ సమావేశం

Goa ministerial meeting in delhi aiims

న్యూఢిల్లీ: గోవా మంత్రివర్గ సమావేశం ఢిల్లీ ఎయిమ్స్ లో శుక్రవారం జరగనుంది. మంత్రివర్గ సమావేశం దవాఖానలో జరగడం ఏంటీనీ షాక్ అవుతున్నారా..?  ఆ రాష్ట్ర సిఎం మనోహర్ పారికర్ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అందుకే వైద్యశాలలో మనోహర్ పారికర్ మంత్రివర్గ సమావేశాన్ని జరపనున్నారు. భాగస్వామ్య పక్షాల సహకారం అదేవిధంగా మిత్రపక్షాలకు శాఖల కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బిజెపి 14 సీట్లు గెలుపొంది ఎంజిపి, జిఎఫ్‌పి, ఎన్‌సిపీతో పాటు మరో ముగ్గురు స్వతంత్రుల సహాకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

Goa ministerial meeting in delhi aiims

Comments

comments