Home తాజా వార్తలు గోవా, పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభం

గోవా, పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభం

POLING

ఢిల్లీ : గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం ఏడు గంటలకే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్‌లో బిజెపి కూటమి, కాంగ్రెస్ కూటమి, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. గోవాలో కూడా బిజెపి, కాంగ్రెస్ , ఆమ్‌ఆద్మీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలీసులు రెండు రాష్ట్రాల్లో భారీగా మోహరించారు.