Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వింత పిల్లలకు జన్మనిచ్చిన మేక

Goat

వింత పిల్లలకు ఓ మేక జన్మనిచ్చింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం కొర్విపాడులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఆశమ్మకు చెందిన మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ఐదు పిల్లల్లో ఒక పిల్ల కోతి ఆకారంలో, మరోటి దూడ ఆకారంలో ఉన్నాయి. మిగితా మూడు సాధారణంగా పుట్టాయి. అయితే.. వింత ఆకారంలో జన్మించిన పిల్లలు పుట్టగానే మరణించాయి. ఇక మేకకు జన్మించిన వింత ఆకారంలో ఉన్న పిల్లలను చూడటానికి ఆ గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాలను చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
– జోగులాంబ గద్వాల

Comments

comments