Home వరంగల్ రూరల్ పాకాలకు గోదావరి జలాలు

పాకాలకు గోదావరి జలాలు

Godawari Water  try to sending  Pakala

మన తెలంగాణ/ఖానాపురం : మండలంలోని కాకతీయులు నిర్మించిన పాఖాల మంచినీటి సరస్సులోకి రామప్ప నుండి గోదావరి జలాలు 90 రోజులలో పాఖాలకు నీరు అందుతాయని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఖానాపురం మండల టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వేముల పల్లి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టి పెట్టి ప్రత్యేకంగా రామప్ప నుండి గోదావరి జలాలు పాకాలకు తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి అశీర్వాదమేనని హర్షం వ్యక్తం చేశారు. 336 కోట్లతో పనులు వేగంగా జరగుతున్నాయని అన్నారు. రామప్ప నుండి పాకా లకు 2.5 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయబడునని తెలిపారు. కాకతీయ వంశీయులు పాకాలను తవ్విస్తే  కేసిఆర్ వంశీయులు గోదావరి నీరు తీసుకువస్తున్నారని అన్నారు. రామప్పలో పంప్‌హౌజ్ పనులు భూమి లెవల్ పూర్తయినవని పై లెవల్‌కు  రావాలి అంటే 19 మీటర్ల లోతు నుంచి పంప్‌హౌజ్ ను నిర్మించుకుంటూ రావాలని తెలియజేశారు. నిర్మాణానికి రెండు నెలల సమయం పడుతుందని, విద్యుత్, ఫినిషింగ్ కావడానికి మరో నెల సమయం పడుతుందని తెలియజేశారు.

ఒక పైపు పొడవు పది ఫీట్లు వెడల్పు 8 ఫీట్లు ఉంటుందని అన్నారు. రామప్ప నుండి డబ్బా వాగు వరకు 24.5 కిలో మీటర్లు ఉంటుందని, దాదాపు 8400 పైపులు పడుతున్నాయని  తెలిపారు. డబ్బా వాగు నుంచి పాకాలకు 6.5 కిలో మీటర్లు  పొడవు ఉంటుందని తెలియజేశారు. పంప్ హౌజ్ దగ్గర మోటర్లను ఏర్పాటు చేయుటకు ఇంజనీర్ల సహాయంతో చైనా నుండి తెప్పించడం జరుగుతుందని అన్నారు. నర్సంపేట పరిధిలో 2 కిలో మీటర్ల పైపు లైను పూర్తి అయ్యిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు విద్యుత్ 30.5 మెగా వాట్ల కెపాసిటీ అవసరమని దానికి అన్ని విధాల ఏర్పాటు చేసామని తెలిపారు. వర్షకాలంలో పనులు ఆపకుండా జరిగే విధం గా అన్నివిధాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. విద్యుత్ ఒక మెగావాట్ విలువ వెయ్యి హెచ్‌పి ఉంటుందని తెలిపారు. నర్సంపేట నియోజక వర్గంలో ఇతర పార్టీ నాయకులు పనులు జరుగుతున్నాయా లేదా చూసి మాట్లాడాలని అన్నారు. ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుందని అప్పటి వరకు వేచి ఉండాలని సూచించారు. పాఖాలకు గోదావరి జలాల ద్వా రా నర్సంపేట నియోజకవర్గంలో రెండవ పంటలకు లక్షా ఇరవై వేల ఎకరాలు సాగు అవుతాయని అన్నారు. ఇ తర రాజకీయ నాయకులు కేసిఆర్ అభివృద్ది చూడలేక కుళ్ళు కుతంత్రాలతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చే శారు. టిఆర్‌ఎస్ పార్టీ రైతుల అభివృద్ది కోసమే పా టు పడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కె ట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల రైతు సమన్వయ కో ఆర్డినేటర్ కుంచారపు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.