Home జాతీయ వార్తలు మహారాష్ట్రకు వెళ్లబోయి…దారితప్పి మధ్యప్రదేశ్‌కు..

మహారాష్ట్రకు వెళ్లబోయి…దారితప్పి మధ్యప్రదేశ్‌కు..

trainముంబై: మనం తెలియని ప్రదేశాలకు వెళ్లినపుడు దారి తప్పడం సహజమే. కార్లోనో వెళ్తున్పప్పుడు దారి తప్పి ఒక చోటుకు బదులుగా మరో చోటుకు వెళ్తుంటాం. కానీ ఓ రైలు దారి తప్పిందంటే నమ్ముతారా..? మహారాష్ట్రకు వెళ్లాల్సిన రైలు దారి తప్పి మధ్యప్రదేశ్‌కు చేరింది. అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే…దేశవ్యాప్తంగా ఉన్న రైతులు సోమవారం దీల్లీకి తరలివచ్చి జంతర్‌మంతర్ వద్ద కిసాన్ యాత్ర పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి 1500 మంది రైతులు ప్రేత్యేక రైళ్లో ఢీల్లీ వచ్చారు. ఆందోళన ముగించుకుని తిరిగి మహారాష్ట్ర వెళ్తుండగా మార్గమధ్యలో రైలు దారి తప్పింది. దీంతో 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్ స్టేషన్ చేరుకుంది. ఐతే మథుర స్టేషన్ వద్ద రైల్వే అధికారులు తప్పుడు సిగ్నల్ ఇవ్వడం వల్లే రైలు ఈ దారి తప్పిందని సమాచారం. వూరూ పేరు తెలియని ప్రాంతంలో ఇలా చిక్కుకుపోయామని వారు తెలిపారు.