Home తాజా వార్తలు నింగికెగిసిన బంగారం, వెండి ధరలు

నింగికెగిసిన బంగారం, వెండి ధరలు

Gold-And-Silverముంబయి : బంగారం, వెండి ధరలు బుధవారం ఒక్కసారిగా రెండు నెలల గరిస్ఠానికి చేరాయి. ఒక్క రోజులోనే 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 340 పెరిగి రూ. 26.690కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం వంటి కారణాల వల్ల ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ఒక్కరోజులోని వెండి ధర రూ. 400 పెరిగింది. దీంతో కెజి వెండి ధర రూ. 34,400కి చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు పెరగడం ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.