Home తాజా వార్తలు శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Shamshabad-air-port2

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి సుమారు రూ. 7.22 లక్షల విలువైన 247 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు పసిడిని ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సుల్లో ఉంచి తీసుకువచ్చినట్లు అధికారుల సోదాల్లో తేలింది. దాంతో అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.