Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పసిడి దిగుమతులు రెట్టింపు

Gold

న్యూఢిల్లీ : బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై వ్యవధిలో విదేశాల నంచి పసిడి దిగుమతులు 13.35 బిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బంగారం దిగుమతులు దేశీయ కరెంట్ ఖాతా లోటు(క్యాడ్)పై ప్రభావం చూపుతున్నాయి. 201617 ఏప్రిల్-జులైలో క్యాడ్ 4.97 బిలియన్ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం జులై నెలలో 1.07 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు.. ప్రస్తుత సంవత్సరం జులైలో 2.10 బిలియన్ 7.76 డాలర్లకు చేరాయి. జులైలో బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 7.76 బిలియన్ డాలర్ల నుంచి 11.44 బిలియన్ డాలర్లకు పెరిగింది.
బంగారం ఎగుమతులపై నిషేధం
మరోవైపు ఇతరదేశాలకు బంగారం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 22 క్యారట్లకు మించిన పసిడి ఎగుమతులను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫారెన్ ట్రేడ్ పాలసీ 201520లో మార్పులు చేసిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఈ విషయాన్ని సోమవారం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ అంశంపై దేశీయ ఆభరణాల తయారీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 23, 24 క్యారెట్ల బంగారం ఎగుమతులకు మాత్రమే నిషేధం ఉండగా.. 22, అంతకు తక్కువ క్యారెట్ల బంగారం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఏడాదికి 170 టన్నుల బంగారం భారత్ నుంచి ఎగుమతి అవుతుండగా.. ఇందులో 15 శాతం వాటా 24 క్యారెట్లదే ఉందని పరిశ్రమ అంచనా వేస్తోంది.

Comments

comments