Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పొగట్ కు పసిడి

 Gold medal in the 50 kg freestyle section of women

వినీశ్‌కు స్వర్ణం, షూటింగ్‌లో రెండు రజతాలు, ఆసియా క్రీడల్లో భారత్ జోరు

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత స్టార్ రెజ్లర్ వినీశ్ పొగట్ చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో పసిడి పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. అంతకుముందు పోటీల తొలి రోజు రెజ్లర్ భజరంగ్ పునియా కూడా స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, వినీశ్ పొగట్ స్వర్ణంతో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా పొగట్ నిలిచింది. కాగా, ఇతర రెజ్లర్లు సాక్షిమలిక్, పింకీలు పతకం రేసు నుంచి వైదొలిగారు. మరో రెజ్లర్ పూజా దండా కాంస్యం సాధించే అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఇదిలావుండగా సోమవారం రెండో రోజు భారత్‌కు షూటింగ్ విభాగంలో రెండు రజతాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్, పురుషుల ట్రాప్ విభాగంలో 19 ఏళ్ల లక్షయ్ రజత పతకాలు సాధించారు. మరోవైపు మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో భారత్‌కు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలై పతకం రేసు నుంచి వైదొలిగింది.

వినీశ్ పసిడి పట్టు…

మహిళల రెజ్లింగ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన స్టార్ రెజ్లర్ వినీశ్ పొగట్ అసాధారణ పోరాట పటిమతో దేశానికి స్వర్ణం సాధించి పెట్టింది. ఒక్కో మెట్టును దాటుకుంటూ వినీశ్ ఏకంగా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. 50 కిలోల ఫ్రిస్టయిల్ విభాగం ఫైనల్లో వినీశ్ పొగట్ 62 తేడాతో జపాన్ రెజ్లర్ ఇరి యుకిను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన వినీశ్ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ స్వర్ణం సొంతం చేసుకుంది. తొలి రౌండ్ నుంచే వినీశ్ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన వినీశ్ 40 ఆధిక్యాన్ని అందుకుంది. రెండో రౌండ్‌లో కూడా వినీశ్ అదే జోరును కొనసాగించింది. ప్రత్యర్థి రెండు పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు పట్టు నిలుపుకున్న వినీశ్ పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా పొగట్ నిలిచింది.

షూటింగ్‌లో రెండు రజతాలు…
మరోవైపు షూటింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. సోమవారం భారత్ ఈ విభాగంలో రెండు రజత పతకాలు సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్టార్ షూటర్ దీపక్ కుమార్ రజతం సాధించాడు. అసాధారణ ఆటను కనబరిచిన దీపక్ కుమార్ తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చైనా షూటర్ యాంగ్ హారాన్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన దీపక్ కొద్ది తేడాతో పసిడి గెలిచే అవకాశం కోల్పోయాడు. హారాన్ 249.1 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. దీపక్ కుమార్ 247.7 పాయింట్లతో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రతికూల వాతావరణం కూడా దీపక్‌కు అవరోధంగా మారింది. ఇదే విభాగంలో చైనీస్ తైపీకి చెందిన లు సాచువాన్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా, పురుషుల ట్రాప్ విభాగంలో భారత షూటర్ లక్షయ్ రజతం సాధించాడు. 39 పాయింట్లు సాధించిన లక్షయ్ రజతం సొంతం చేసుకున్నాడు. చైనీస్ తైపికి చెందిన కుంగ్‌పి యాంగ్ 48 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. కొరియా షూటర్‌కు కాంస్యం లభించింది. కాగా, భారత షూటర్ మన్‌జీత్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచి పతకం గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

బ్యాడ్మింటన్‌లో నిరాశ…
కాగా, మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. కచ్చితంగా పతకం సాధిస్తుందని భావించిన మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్ దశలోనే వైదొలిగింది. సోమవారం జరిగిన మహిళల టీమ్ విభాగం పోటీల్లో భారత్ 13 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో పతకం గెలవాలనే భారత్ ఆశలు నీరుగారాయి. తొలి సింగిల్స్‌లో పి.వి.సింధు విజయం సాధించి భారత్ 10 ఆధిక్యాన్ని అందించింది. యమగూచితో జరిగిన తొలి మ్యాచ్‌లో సింధు 2118, 2119తో విజయం సాధించింది. అయితే తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్‌కు చుక్కెదురైంది. డబుల్స్ విభాగంలో సిక్కిరెడ్డి జోడీ ఓటమి పాలైంది. మరో సింగిల్స్ సైనా నెహ్వాల్ కూడా పరాజయం చవిచూసింది. కచ్చితంగా గెలవాల్సిన మరో డబుల్స్‌లో కూడా పొన్నప్పసింధు జోడీ ఓటమి మూటగట్టుకుంది. దీంతో భారత్ పతకం నుంచి నిష్క్రమించక తప్పలేదు.

Comments

comments