Search
Thursday 20 September 2018
  • :
  • :

రూ.30 వేలు దాటిన బంగారం

Goldముంబయి: బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. శ్రావణమాసం సందర్భంగా పసిడి కొనుగోళ్లు పెరిగాయి. దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.30వేల మార్క్‌ను చేరుకుంది. గురువారం రూ.300 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ. 30,050కు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీక్షలో బంగారంపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో బులియన్ మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా 0.43శాతం పెరిగి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,288.30 డాలర్లుగా ఉంది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. గురువారం ఒక్కరోజే రూ. 900 పెరగడంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 40,200లకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు దేశీయంగా బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై వ్యవధిలో పసిడి దిగుమతులు 13.35 బిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించింది. బంగారం దిగుమతులు దేశీయ కరెంట్ ఖాతా లోటుపై ప్రభా వం చూపుతున్నాయి. 201617 ఏప్రిల్-జులైలో క్యాడ్ 4.97 బిలియన్ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం జులై నెల లో 1.07 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు.. ప్రస్తుత సంవత్సరం జులైలో 2.10 బిలియన్  7.76 డాలర్లకు చేరాయి. జులైలో బంగారం దిగుమతులు పెరగడంతో వాణి జ్య లోటు 7.76 బిలియన్ డాలర్ల నుంచి 11.44 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇతరదేశాలకు బంగారం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Comments

comments