Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

తగ్గిన బంగారం ధర

Reduced Gold Price

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ… దేశీయ మార్కెట్ లో డిమాండ్‌ లేకపోవడంతో బంగారం ధర ఇవాళా కాస్త దిగొచ్చింది. శుక్రవారం బులియన్‌ మార్కెట్లో రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,400 పలికింది.  ఇక వెండి కూడా పసిడి దారిలోనే అడుగులేసింది. దేశంలో కొనుగోళ్లు సరిగా లేకపోవడంతో రూ. 250 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కెజి వెండి ధర రూ. 37,650గా ఉంది. అంతర్జాతీయంగా పసిడిలో పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికి దేశీయంగా నగల వ్యాపారులు, రిటైలర్లు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఈ లోహాల ధరలు పడిపోయినట్టు స్టాక్ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో 0.61శాతం పెరిగి ఔన్సు బంగారం 1,208.20 అమెరికన్‌ డాలర్లు ఉంది. వెండి కూడా 0.78శాతం పెరిగి ఔన్సు ధర 14.25 అమెరికన్‌ డాలర్లు పలికింది.

Comments

comments