Home తాజా వార్తలు 34 వేలకు చేరువలో బంగారం

34 వేలకు చేరువలో బంగారం

Gold price

 

ముంబై: డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 34వేలకు చేరువైంది. అంతర్జాతీయంగా సానుకూలం అంశాలు, కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం ఒక్క రోజే 10 గ్రాములు బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి రూ.33,870 (10 గ్రాములు)కు చేరింది. మరోవైపు వెండి కూడా నేడు బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మెరుగవ్వడంతో ఒక్క రోజే కిలో వెండి ధర రూ. 550 పెరిగి రూ.38,400కు చేరింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, ఇతర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే ఉత్తమమని మదుపర్లు భావిస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,358 అమెరికన్ డాలర్లుగా ఉంది.

Gold price in domestic market 34, 000