Home బిజినెస్ మళ్లీ పసిడి ధగధగలు

మళ్లీ పసిడి ధగధగలు

Gold price up again It grows up to 180
న్యూఢిల్లీ: బంగారం ధర మళ్లీ రూ. 180 మేరకు పుంజుకుంది. బులి యన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర 10 గ్రాములు రూ. 30, 700కు చేరుకుంది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధర ఊపందుకుంది. వెండి ధర కూడా రూ. 105 మేరకు పెరిగి కిలో వెండి ధర రూ. 39,000కు చేరుకుంది. పారి శ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్లు వర్తకులు చెప్పారు. విదేశాల్లో బంగారం ధర పడిపోయినప్పటికీ పండుగ సీజన్(శ్రావణ) కావడంతో దేశీయ స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగినందున బంగార ధర పుంజుకుంది. న్యూ యార్క్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర 0.07 శాతం పడిపోయి ఔన్స్ బంగారం ధర 1211.20 డాలర్లు పలికింది. కాగా వెండి ధర 0.94 శాతం పడిపోయి ఔన్స్ వెండి ధర 15.28 డాలర్లు పలికింది. ఇదిలా ఉండగా రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 180 పెరిగి 99.9 శాతం స్వచ్ఛ బంగారం 10గ్రాములురూ.30,700లు,99.5% స్వచ్ఛ బంగారం రూ.30,550 ధర పలికింది. సావరిన్ బంగారం మార్పు లేకుండా యథాతథంగా ఉంది. ఎనిమిది గ్రాముల పీస్ రూ. 24,600 వద్ద స్థిరం గా ఉంది. వెండి నాణేల ధర రూ. 1000 మేరకు పెరిగి 100 పీసుల కొనుగోలు ధర రూ. 74,000, అమ్మకం ధర రూ. 75,000గా ఉంది.