Home తాజా వార్తలు పసిడి ధర పైపైకి

పసిడి ధర పైపైకి

Goldముంబయి : పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండడంతో బంగారం ధర పైపైకి పోతుంది. విదేశీ మార్కెట్‌లో లొహాలు బలహీనపడుతున్నప్పటికీ పెళ్లిళ్ల సీజన్ నగల కొనుగోళ్లు పెరగడం వల్ల ధర పెరుగుతోంది. సోమవారం పది గ్రాములు బంగారం ధర రూ. 175 పెరిగి రూ. 27,875కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మద్దతు లభించడంతో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 250 పెరిగి రూ. 36,050కి చేరింది.