Home తాజా వార్తలు ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Gold Seized at Shamshabad Airportరంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రెండు కిలోల బంగారం పట్టుబడింది. ఇండోర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.66.27 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. ఈ ఘటనలో సదరు ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు.

Gold Seized at Shamshabad Airport