Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Shamshabad Airportరంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం భారీగా  బంగారం పట్టుబడింది. 2.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారం పట్టుకున్నట్టు వారు వెల్లడించారు. నిందితుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కారు ఇంజిన్‌కు సంబంధించిన వస్తువులు కనిపించాయని, వాటిని  క్షుణ్ణంగా పరిశీలించగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. నిందితుడిపై  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు చెప్పారు. ఇటీవలి కాలంలో ఈ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడడం సర్వసాధారణంగా మారింది. తనిఖీలు చేస్తున్నప్పటికీ ఈ ఎయిర్ పోర్టు ద్వారా అక్రమంగా బంగారాన్ని తరలించడం చర్చనీయాంశంగా మారింది.

Gold Seized at Shamshabad Airport at Rangareddy