Home జాతీయ వార్తలు కేరళలో భారీగా బంగారం పట్టివేత

కేరళలో భారీగా బంగారం పట్టివేత

Goldతిరువనంతపురం : కేరళలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ఈ ఘటన తిరువనంతపురం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో  సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌ కండీషన్‌ టెక్నిషియన్‌ వద్ద 9.9 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ  సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్టు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.

Gold Seized in Airport at Kerala on Tuesday