Home తాజా వార్తలు ‘గోల్డ్’ ట్రైలర్…

‘గోల్డ్’ ట్రైలర్…

Akshay's-Gold

ముంబయి: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గోల్డ్’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ తో మూవీపై అంచనాలు పెంచేశాడు అక్షయ్. రీమా కాగ్డీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో 1946లో భారత్ కు గోల్డ్ మెడల్ అందించిన హాకీ కోచ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. ఇప్పటికే వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ బాలీవుడ్ ఖిలాడీ గోల్డ్ చిత్రంలో మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించనున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో బుల్లితెర ధారవాహిక ‘నాగిని’ ఫేం మౌనీ రాయ్‌ అక్షయ్‌కు జోడీగా నటిస్తోంది. వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి ఈ సినిమా విడుదల కానుంది.