Home రాష్ట్ర వార్తలు వరంగల్‌లో బంగారం దొంగ ఆరెస్టు

వరంగల్‌లో బంగారం దొంగ ఆరెస్టు

Gold-Theifరూ.2లక్షల విలువగల బంగారు అభరణాలు స్వాధీనం
పోచమ్మమైదాన్ : కళ్యాణ మండపాలల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడుని బుధవారం ఆరెస్టు చేసిన వరంగల్ కమీషనరేట్ సిసిఎస్ కె.ఈశ్వర్‌రావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడు సంగెం మండలం, గవిచర్ల గ్రామానికి చెందిన గట్టికొప్పుల చంద్రమౌళిగా గుర్తించడం జరిగిందని అన్నారు. నిందితుడు డిగ్రీ వరకు చదువుకొని జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతపూర్‌లోని జెర్సీ మిల్క్ డైరీలో ఒక సంవత్సరన్నర కాలం పాటు పని చేసాడు. ఇదే సమయంలో నిందితుడు తాగుడుకి, జల్సాలకు అలవాటు పడి ఉద్యోగానికి గైర్హాజర్ కావడంతో నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. దీంతో నిందితుడు జల్సాలకు డబ్బులు లేక పోవడంతో కళ్యాణ మండపాల్లో, పెండ్లి ఊరిగింపులో వద్ద మహిళా మెడలలోని బంగారు ఆభరణాలకు చోరీకి పాల్పడతున్నట్లుగా తెల్సిందని అన్నారు. ఖచ్చితమైన సమచారం రావడంతో నిందితుడిని పట్టుకొవడం జరిగిందని అన్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారుగా రూ.2లక్షల 50వేల విలువగల 93గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.