Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బాలికల విద్యకు బంగారు భవిష్యత్

Golden future for girls' education
నిర్మల్‌అర్బన్‌: తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బాలికల విద్యాకు బంగారు భవిష్యత్‌ను ఇస్తుందన్నారు. బుధవారం నిర్మల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్‌ చంద్ర సితార మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన గురకుల కళాశాలను, ప్రైవేట్ కళాశాలలకు దీటూగా మెరుగైన, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విలువలతో కూడిన గ్రామీణ పేద విద్యార్తులకు విద్యను అందజేయడమే లక్షంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ మహిళ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్‌చంద్ర సితార తెలియ చేశారు. ఈ గురుకుల డిగ్రీ కళాశాల్లో ప్రవేశానికి ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిసి, ఎంఎస్‌సిఎస్, ఎంజెడ్‌సి, బిజెడ్‌సి, బిఎ, బికాం వివిధ కోర్సులలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నిర్మల్ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల్లో సుమారుగా 550 పైగా విద్యార్థినిలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ఆధునాతన సౌకర్యాలతో కూడిన బోధన. ప్రోజెక్టర్ సాయంతో పాటు ప్రయోగశాలల ద్వారా బోధన కంప్యూటర్ విద్యతో పాటు వారికి దుస్తువులు, పుస్తకాలు వారికి కావాల్సిన వస్తువులు అన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని కూడా అందిస్తున్నామని తెలియజేశారు. నాణ్యమైన విద్యతో పాటు సహాపాట్య కార్యక్రమాలకు పోటీల శిక్షణ, నిర్వహణ కోర్సులను కొనసాగించడం జరుగుతుందన్నారు. అనేక క్రీడలను, చిత్రలేకణం, సంగీతం, నృత్యాలు, ఉపన్యాసలు, వ్యాసరచన, కేశలంకారణ, జానపద శాస్త్రీయ నృత్య శిక్షణను ఏర్పాటు చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థిణులను రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ మహిళ యువతులకు చదువుతో పాటు వారి భవిష్యత్‌కు తోడ్పడే అనేక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించే లక్షంతో చదివే విద్యార్థినిలకు ఉత్తమ అధ్యాపాకులచే పోటీ పరీక్షల గైడెన్స్‌తో పాటు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపల్ శ్రావణి, ఉపాధ్యాయురాలు సరోజిణి, ఉమారాణీ, ప్రణవి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments