Home తాజా వార్తలు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ విన్నర్స్

‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ విన్నర్స్

Golden-Globe-Awards

లాస్‌ఏంజిల్స్: 74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి లాస్‌ఏంజిల్స్‌లోని బెవర్లీ హీల్స్ అట్టహాసంగా జరిగింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో భారతీయ నటి ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెండితెర, బుల్లితెరపై ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.

అమెరికన్ నటీ ఎమ్మా స్టోన్ ఈ యేడాది ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే ఉత్తమ కథనాయకుడిగా ర్యాన్ గోస్లింగ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. వీరిద్దరు రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన లాలా ల్యాండ్‌లోకలిసి నటించడం విశేషం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ విన్నర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ నటుడు(మ్యూజికల్/కామెడీ): ర్యాన్ గోస్లింగ్ట్(‘లాలా ల్యాండ్’ మూవీకి)
ఉత్తమ నటి(మ్యూజికల్/కామెడీ): ఎమ్మా స్టోన్(‘లాలా ల్యాండ్’ మూవీకి)
ఉత్తమ నటుడు(డ్రామా): కేసీ ఆప్లెక్(‘మాంచెస్టర్ బై ద సీ’ మూవీకి)
ఉత్తమ నటి(డ్రామా): ఇసబెల్లా హుపెర్ట్(‘ఎలీ’ మూవీకి)
ఉత్తమ సహాయ నటి: వియోలా డావిస్(‘ఫెన్సెస్’ మూవీకి)
ఉత్తమ సహాయ నటుడు: ఆరోన్ టేలర్(‘నాక్టర్నల్ యానిమల్స్’ మూవీకి)
ఉత్తమ మూవీ(డ్రామా): మూన్‌లైట్
ఉత్తమ మూవీ(మ్యూజికల్/కామెడీ): లా లా ల్యాండ్
ఉత్తమ దర్శకుడు: డామియెన్ ఛాజెల్