Home జిల్లాలు బంగారు ‘ఖేడ్’గా మారుస్తాం

బంగారు ‘ఖేడ్’గా మారుస్తాం

21212నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి బంగారు ఖేడ్‌గా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, గను లు, భూగర్భజలాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం నారాయణఖేడ్‌తో పాటు పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలా ల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్వాతం త్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచిపోయినా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక్క మార్కెట్ యార్డు, ఒక్క పిజి కాలేజీ లేకపోవ డం వెనుకబాటుకు నిదర్శణమిస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న నారాయణఖేడ్ నియోజ కవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు లేక అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యార న్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్తంభాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా పనికాలేదన్నారు. ఇప్పుడు అలాంటి పనియేమీ ఉండదని, నియో జకవర్గంలో ఒక్కరోజే 10 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నారా యణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో 100 పడకల ఆసు పత్రి, కల్హేర్ మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణా నికి హామీ ఇచ్చారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లా ల్సిన అవసరం లేకుండా 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.