Home తాజా వార్తలు గ్రామీణాభివృద్ధితోనే బంగారు తెలంగాణ : ఎర్రబెల్లి

గ్రామీణాభివృద్ధితోనే బంగారు తెలంగాణ : ఎర్రబెల్లి

Minister Errabelliవరంగల్‌ రూరల్ : గ్రామీణాభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వర్థన్నపేటలో ఆదివారం నూతన సర్పంచులకు సన్మాన సభ జరిగింది. ఈ సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. సర్పంచులు తమతమ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం అంకితభావం, నిజాయితీతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. కెసిఆర్ కలలు కనే బంగారు తెలంగాణ కోసం అందరూ అంకితభావంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో  ఎంపిలు వినోద్‌ కుమార్‌, దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, ఎంపిపి మర్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Golden Telangana with Rural Development : Errabelli