Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉజ్వల భవిత

ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉజ్వల భవిత

అన్నీ తానై అవసరాలు తీరుస్తున్న ‘భవిత’ ప్రత్యేక కేంద్రం
మధ్యాహ్న భోజనం, యూనిఫారం, వీల్‌ఛైర్స్ తదితర సౌకర్యాలు
వినడానికి, నడవడానికి అవసరమైన వస్తువుల పంపిణీ
వినికిడి, మాట్లాడడంలో ప్రత్యేక తర్ఫీదు
పోషకాహారం, విద్యాభ్యాసం, ప్రత్యేక శిక్షణతో పిల్లల్ని తీర్చిదిద్దుతున్న కేంద్రం

HANDICAPED

మన తెలంగాణ/ మేడ్చల్  : జన్మతః మానసిక, శారీరక వికలాంగులుగా జన్మించే వారికి ప్రత్యేకంగా ఉండేందుకు ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజాబిలిటి (ఐఇడి) నియమ, నిబంధనలతో భారత ప్రభుత్వం 1988లో కొన్ని ప్రత్యేక అవసరాల కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో భవిత రాజీవ్ విద్యా మిషన్ సర్వశిక్ష అభియాన్‌లో భాగంగా కొనసాగుతుండగా ఈ ప్రభుత్వం విద్యా శాఖకు అనుసంధానం చేసి ప్రత్యేక దృష్టిని పెట్టేందుకు కృషి చేస్తున్నది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పిల్లలతో పాటు పాఠశాలకు వెళ్లలేరు కాబట్టి వారికి ఆ అవసరాలను సమకూర్చుతూ వారిని పాఠశాలలకు పంపేందుకు సంసిద్ధులను చేసే కేంద్రమే ‘భవిత’ ప్రత్యేక అవసరాల కేంద్రం. ఈ ‘భవిత’ కేంద్రా న్ని మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయం ఆవర ణలోనే మే నెల 2012లో నాటి ఎమ్మెల్యే కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. భవిత కేంద్రంలో ప్రస్తుతం 22 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం నవంబర్‌లో మండలంలోని పూడూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని ఓ గదిలో నూతన భవిత ఉప కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అందులో ప్రస్తుతం 14 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యనభ్యసిస్తు న్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను బయటకు పంపేందుకు కొంత మంది తల్లిదండ్రులు ఇష్టపడరని వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను పంపించే విధంగా కృషి చేస్తామని భవిత కేంద్రం ఐఇఆర్‌పి పి.థెరిసా వాపోయారు. ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయబడింది. భవిత ప్రత్యేక కేంద్రం మండల కేంద్రాల్లో ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏడు సంవత్సరాల వయస్సు వారి నుండి 14 సంవత్సరాల వయస్సు వారి వరకు ప్రవేశాలను తీసుకుంటారు.

మానసిక, శారీరక వికలాంగులుగా ఉన్న వారిని ఐఈఆర్‌టిలు ప్రతి గ్రామంలో సర్వే చేసి విభిన్న ప్రతిభావంతులను గుర్తించి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లలను భవిత కేంద్రంలో చేర్పిస్తుంటారు. ప్రతి రోజు వారు భవిత కేంద్రానికి వచ్చేందుకు వారికి రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఇలా ప్రత్యేక అవసరాల పిల్లలకు స్థానికంగా ఉండే పాఠశాలలో పేరును నమోదు చేసి వారి మానసిక స్థితికి అనుగుణంగా వారికి పరికరాలతో విద్యను బోధిస్తారు. శారీర వికలాంగులైన వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యుడితో వ్యాయామం చేయించి వారిలో మార్పునకు ప్రయత్నం చేస్తారు. వారి పనులు వారే చేసుకునేలా శిక్షణ అందించి అక్షర జ్ఞానం నేర్పించేందుకు ఈ కేంద్రమే ఆధారం. దీంతో పాటు ప్రతి సోమవారం విద్యార్థులకు ఫిజియోథెరపి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్పీచ్ థెరపి, పర్సనల్ స్కిల్స్‌లో భాగంగా భోజన విధానం, మల,మూత్ర విసర్జన విధానం, వస్త్ర ధారణ విధానం, చదవడం, రాయడం వంటి వాటిని నేర్పుతుంటారు. మేడ్చల్ మండలంలోని గ్రామాల్లో మంచం నుండి లేవకుండా ఉండే పిల్లలను గుర్తించి ప్రతి శనివారం సుమారుగా నలుగురికి వారి ఇంటికే వెళ్లి పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రాథమిక శిక్షణను భవిత కేంద్రం సిబ్బంది ఇస్తారు. భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం, యూనిఫారం, వీల్‌ఛైర్స్, వినడానికి, నడవడానికి అవసరమైన వస్తువులను అందజేస్తుంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రంలో శిక్షణను ఇచ్చి కొంత మేర మంచిగా మారిన తర్వాత స్థానిక పాఠశాలలకు పంపిస్తుంటారు. అలా సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా కొంత మేర పాఠశాలలో రాణిస్తున్నారు. అలా ప్రతి సంవత్సరం మేడ్చల్ భవిత కేంద్రం నుండి కూడా స్థానిక పాఠశాలలకు ప్రవేశాలను కల్పిస్తున్నారు. కాని ప్రత్యేక అవసరాల పిల్లల సంరక్షణకు స్థానిక పాఠశాలల్లో కూడా ఒక రిసోర్స్ పర్సన్‌ను నియమిస్తే బాగుంటుందని ఇక్కడి సిబ్బంది అభిప్రాయం. పిల్లలకు ఆనందాన్ని కలిగించేందుకు భవిత కేంద్రంలో పిల్లల జన్మదినోత్సవాలు జరుపుతుంటారు. వీటితో పాటు పండుగల విశేషాలను తెలుపుతూ పర్వదినాలను జరిపిస్తుంటారు భవిత కేంద్రం సిబ్బంది. భవిత కేంద్రం సిబ్బంది గ్రామాల్లో సర్వే చేసి పిల్లలను కేంద్రాని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నా ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రాలకు పంపేందుకు వెనుకాడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అన్ని అవసరాలు తీర్చాలనేది భవిత కేంద్రం ప్రధాన ఉద్ధేశ్యమని ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
పౌష్టికాహారం అందక పిల్లలకు తీవ్ర వేదన
అసలే మానసిక, శారీరక వికలాంగులుగా ఉన్న పిల్లలకు సాధారణ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో అందించే భోజనాలనే అందించడం చాలా బాధాకరం. స్థానిక పాఠశాల నుండి ప్రతి రోజు భవిత కేంద్రానికి హాజరైన వారి హాజరును బట్టి భోజనాలు అందుతా యి. పౌష్టికాహారం అందడం లేదని సాంబారు, అన్నం మాత్రమే అంది స్తున్నారని వచ్చిరాని మాటలతో పిల్లల మనోవేదనను వెలిబుచ్చుతున్నా రు. ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఉన్నతాధికా రులు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద పెట్టాలను పలువురు ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.
పిల్లలకు మరింత సహాయం అవసరం : పి.థెరీసా, భవిత కేంద్రం ఐఇఆర్‌పి
భవిత కేంద్రంలో పిల్లలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది స్తున్నాం. కొంత మంది దాతల సహాయంతో మరిన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నా. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఈ నెలలో అలింకో హెల్త్ క్యాంపు ఉంటుందని ప్రత్యేక అసరాలు గల పిల్లలకు వీల్‌ఛైర్లు, పరికరా లు అందజేస్తారని వాటి కోసం భవిత కేంద్రంను సంప్రదించాలని కోరుతున్నారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కేంద్రం లోని వరండాలో గ్రిల్స్ ఏర్పాటు చేస్తే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఉన్నతాధికారుల నుండి సహాయ సహాకారాలు మంచిగా ఉన్నాయి. ప్రత్యేక అవసరాల పిల్లలకు సహాయం చేసేందుకు దాతలు కూడా ముందుకు రావడం ఆనందంగా ఉందని మరింత మంది ముందుకు వస్తే బాగుంటుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎల్లప్పుడు ఆనం దంగా ఉండేందుకు సిబ్బంది కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక పిల్లలకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది ఎళ్లవేళల సిద్ధంగా ఉంటాం.