Home బిజినెస్ దీర్ఘకాలిక ఈక్విటీలతో మంచి రాబడి

దీర్ఘకాలిక ఈక్విటీలతో మంచి రాబడి

stock-market-broker-securitడెరివేటివ్స్ గడువు ముగింపుపై ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ : చైనా మందగమనం ఆందోళ నలు, అమెరికా ఫెడ్ రేటు పంపు, కమో డిటీస్ ధరల్లో కరెక్షన్ వంటి అంతర్జా తీయ పరిణామాల నేపథ్యంలో 2016 సంవత్సరం మార్కెట్‌కు తీవ్ర ఒడిదుడు కుల మయంగా మారింది. గత సంవ త్సరం సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 5 శాతం రాబడులనే ఇవ్వగా, స్వల్పకాలిక ఫండ్, ఇతర ట్రేడర్లను నిరుత్సా హపరిచింది. ఆసక్తికరమైన విషయ మేమిటంటే మార్కె ట్ దిగివస్తోంది. ప్రస్తుతం ఉన్నఇన్వెస్టర్లు అలాగే ప్రారంభ ఇన్వెస్టర్లకు అనుకూల అంశమే అదేలా అంటే దీర్ఘకాలికంగా పెట్టుబడులు వారికి కలిసి వస్తాయి. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ కాలం వేచిచూడడం వల్ల మంచి రాబడులు వస్తాయి. సోమవారం సెన్సె క్స్ స్వల్ప లాభాలతో ముగిసింది.  ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, డెరివేటివ్స్ గడువు తేదీ సమీపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహ రించారు. ఆఖరిరోజు సెన్సెక్స్ 50 పా యింట్లు లాభపడి 24,486 వద్ద , నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 7,436 పాయిం ట్ల వద్ద స్థిరపడింది. మొత్తానికి వరుసగా రెండో రోజు సూచీలు లాభాలను నమో దు చేశాయి. కెయిర్న్ ఇండియా షేరు ధర భారీగా 5.14 శా తం లాభపడి రూ.118.65 వద్ద ముగిసింది. అలాగే టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, అంబుజా సిమెం ట్ సంస్థ షేర్లు సైతం లాభపడ్డాయి. అలాగే ఎల్ అండ్ టి షేరు ధర అత్యధికంగా 2.67శాతం నష్టపోయి రూ.1,111.70 వద్ద ముగి సింది. దీనితోపాటు గెయిల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్ సం స్థల షేర్లు నష్టపోయాయి. బిఎస్‌ఇ రంగాల సూచీలు పరి శీలిస్తే మెటల్ అత్యధికంగా 1.58 శాతం లాభ పడగా, ఆ తర్వాత కన్జూమర్ డ్యూర బుల్స్ 1.34 శాతం, హెల్త్‌కేర్ 0.97 శాతం, రియాల్టీ 0.5 శాతం లాభపడ్డా యి. మరో వైపు క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.9 శాతం పతనమవ్వగా, ఆ తర్వాత ఆటో రంగం 0.69 శాతం, పవర్ 0.4 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.29 శాతం నష్టపోయింది. బుధవారం మార్కెట్ ఒడి దుడుకల మధ్యే సాగనుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌కు నేడు గడువు తేది కావ డంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిం చనున్నారు. ఇప్ప టికే మార్కెట్ భారీగా పడిపోయింది. సోమవారం స్వల్పంగా లాభపడి సూచీలపై త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా కని పించనుంది.