Thursday, April 25, 2024

భారతీయులకు శుభవార్త.. అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయులకు విజిటర్స్ వీసాల నిరీక్షణ సమయం మరింతగా తగ్గించేందుకు అమెరికా అధికార యంత్రాంగం యత్నిస్తోంది.యుఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ సహాయ కార్యదర్శి రెనా బిట్టర్ గురువారం ఈ విషయం తెలిపారు. విజిటర్స్ వీసా వెయిట్ టైం గత ఏడాది 76 శాతం మేర తగ్గింది. ఇప్పుడు దీనిని మరింతగా కుదించేందుకు తాము రెడీ అవుతున్నామని వివరించారు. ఇంతకు ముందెప్పుడూ లేని సంఖ్యలో భారతీయులు అమెరికాలో పర్యటించేందుకు అనువుగా వీసాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది ఇండియాలోని అమెరికా ఎంబసీ ద్వారా భారతీయులకు రికార్డు సంఖ్యలో 1.4 మిలియన్ల వీసాలు జారీ చేసింది.

వివిధ కేటగిరి విజిటర్స్ వీసాల పరిధిలో వెయిట్ టైం ఉండదు. అయితే పర్యాటకానికి అమెరికాకు తొలిసారి వచ్చే భారతీయుల వీసాల విషయంలో నిరీక్షణ తప్పడం లేదు. దీనిని గడిచిన ఏడాది గణనీయంగా తగ్గించామని లేడి రెనా తెలిపారు. ఇరుదేశాల నడుమ ప్రజల రాకపోకలు అత్యంత కీలకం. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారపరమైన ప్రయాణాలు , కుటుంబ సంబంధిత ప్రయాణాల విషయాలలో వీసాల సమస్య ఎక్కువగా ఉండకుండా చూస్తామని ఆమె తెలిపారు. ఎందుకంటే ఇరుదేశాల సన్నిహిత సంబంధాలు అత్యంత కీలకమైనవి అన్నారు. ఇండియా నుంచి అమెరికాకు సందర్శకుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే సాధ్యమైనంత త్వరగా వీసాల జారీకి తగు ప్రక్రియ ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ లోపాలను సవరించుకుంటూ, వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News