Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్ యూజర్లకు తీపికబురు!

YouTube-image-done-in-ptsప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ యూజర్లకు తీపికబురందించింది. యూట్యూబ్‌లో చాలా మంది వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే కొన్ని వీడియోలలో కొన్ని అంశాలు చూపించకుండా సెన్సార్ చేయాలనుకుంటారు. ఇనాళ్లు ఆ సౌకర్యం యూట్యూబ్‌లో లేదు. ఇప్పుడు యూట్యూబ్ వినియోగదారుల కోసం బ్లర్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టూల్ ద్వారా వీడియోలో వేటినైతే నిషేదించాలనుకున్నారో వాటిపై బ్లర్ చేయొచ్చు ఉదాహరణకు నంబర్ ప్లేట్లు, క్రెడిట్ కార్డ్ నంబర్స్, ఫోన్ నంబర్లు ఇలాంటి వాటిని బ్లర్ చేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవారికి ఈ బ్లర్ టూల్ చాలా ఉపయోగపడుతుందని యూట్యూబ్ భావిస్తోంది.

Comments

comments