Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘ముద్దుగారే యశోద’కు మంచి స్పందన

Yashoda

సమీర్, పవిత్ర లోకేష్, మధుమణి, శృతి తదితరులు నటించిన వెబ్ సిరీస్ ‘ముద్దుగారే యశోద’. శ్రీ చైతూ దర్శకత్వంలో రాజ్ రాచూరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రముఖుల కోసం ప్రదర్శించడం జరిగింది. సింగర్ సునీత, ఉత్తేజ్, బిత్తిరి సత్తి, కళ్యాణి, మల్లిక్ ఈ వెబ్ సిరీస్‌ను చూశారు. ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ “ శ్రీ చైతూ ఇదివరకు నాతో ‘రాగం’ అనే షార్ట్ ఫిలిం చేసింది. ఇప్పుడు చాలా మంచి టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ చేసింది. ఇందులో నటించిన పిల్లలు అంతా బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ నాకు సినిమాగానే అనిపించింది”అని అన్నారు. దర్శకురాలు శ్రీ చైతూ మాట్లాడుతూ “ఈ వెబ్ సిరీస్‌కు సునీత తన వాయిస్ ఇచ్చారు. అందరికీ ఈ వెబ్ సిరీస్ నచ్చడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. నిర్మాత రాజ్ రాచూరి మాట్లాడుతూ “మంచి విజన్ ఉన్న దర్శకురాలు శ్రీ చైతూ. త్వరలోనే మేము మూడు భాషల్లో ఓ సినిమా చేస్తాం”అని పేర్కొన్నారు.

Comments

comments