Home వార్తలు ‘ఒక్కడొచ్చాడు’ టీజర్‌కు అద్భుత స్పందన

‘ఒక్కడొచ్చాడు’ టీజర్‌కు అద్భుత స్పందన

OKKADOCHADUవిశాల్, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లా డుతూ “ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తయింది. ఒక్కడొ చ్చాడు చిత్రం టీజర్‌ను శుక్రవారం కాజల్ విడుదల చేశారు. ఒక్కరో జులోనే తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్‌కు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. టీజర్‌కు అన్నిచోట్ల నుండి అద్భుత స్పందన వస్తోంది. విశా ల్ కెరీర్‌లోనే ఈ చిత్రం డిఫరెంట్ మూవీ అవుతుంది. యాక్షన్ ఉంటూ నే మంచి సందేశంతో రూపొం దుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లు చాలా రిచ్‌గా తీయడం జరిగింది. హిప్‌హాప్ తమిళ చా లా అద్భుతమైన సంగీతాన్ని అందిం చారు. నవంబర్ మొదటి వారం లో ఆడి యోను రిలీజ్ చేసి… అదేనెల 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. జగపతిబాబు విలన్‌గా నటి స్తున్న ఈ చిత్రంలో సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తు న్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః రిచర్డ్ ఎం.నాథన్, మాటలుః రాజేష్ ఎ.మూర్తి, పాటలుః డా.చల్లా భాగ్యలక్ష్మి, ఎడిటింగ్‌ః ఆర్.కె.సెల్వ.