Search
Saturday 22 September 2018
  • :
  • :

మొబైల్ యాప్‌తో సత్ఫలితాలు

YAPP

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ప్రజా సమస్యలను జాప్యం లేకుండా నిర్ణీత గడువులోనే పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన ఈ సంగారెడ్డి మొబైల్ యాప్ సత్ఫలితాలు ఇస్తుందని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా తమ సమస్యను ఆన్‌లైన్‌లో ఈ సంగారెడ్డి మొబైల్ యాప్ పోస్టు చేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే అవకాశం అధికారులకు కలుగుతుందన్నారు.

యాప్‌లో గ్రీవెన్స్ మానిటరింగ్‌తో పాటు ఈ సర్వీసెస్ ద్వారా రెవెన్యూ  శాఖకు సంబం ధించిన 9 సేవలను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ యాప్‌లో ప్రజలు అడిగిన దృవీకరణ పత్రాలు పొందేందుకు ఒక్కొదానికి రూ.20/- ల చొప్పున చెల్లించాల్సిఉంటుందని ఆయన తెలిపారు. పటాన్‌చెరు మండలం ఐనోల్ గ్రామానికి చెందిన హర్షవర్థన్ మొబైల్ యాప్‌లో ఏడు రకాల సర్టిఫికేట్లు కావాలని ఫిర్యాదు చేసారని అన్నారు. ఒరిజినల్ సెత్వార్, కాసారా పహాణీ, ఆర్‌ఓఆర్ పహాణీ, గత 5 సంవత్సరా లకు సంబంధించి పహాణీ, సెక్షన్ 22-ఎ, క్రింద భూముల వివరాలు అడిగారు. పటాన్‌చెరు తహాసీల్దార్ ఈ- సంగారెడ్డి మొబైల్ యాప్‌ప ద్వారా ఫిర్యాదును స్వీకరించిన రోజునే మధ్యాహ్నం లోగా సదరు వ్యక్తికి సంబంధిత దృవీకరణ పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ-సంగారెడ్డి యాప్ ద్వారా జవాబుదారితనం, స్పష్టత, పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పటాన్‌చెరు తహాసీల్దార్ గిరి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments