Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఉల్లిపాయతో ఎంతో మేలు

Onion

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. నిజంగా ఇది మానవులకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిలో ఎన్నో పోషకాలున్నాయి. ఉల్లిని అన్ని కూరలలో వాడుతారు. రోజు 100 గ్రాముల ఉల్లిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యంలో ఉల్లి ప్రాముఖ్యత :

  • ఉల్లిలో సల్ఫర్, పొటాసియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
  • జీర్ణక్రియ మెరుగయ్యేలా చేస్తుంది. శరీరంలోని మంచి కొవ్వుని నిల్వ ఉంచడంలో ఎర్ర ఉల్లి ఎక్కువ ఉపయోగపడుతుంది.
  • నిద్రలేమితో బాధపడే వారు ఉల్లిని తీసుకోవడం ద్వారా కంటి నిండా నిద్ర పోవచ్చు.
  • ఉల్లిలో క్యాన్సర్‌ని నిరోధించే గుణం ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది.
  • రోజూ ఉల్లిని తీసుకోవడం ద్వారా ఎముకల్లో బలహీనత వంటి సమస్యలను అధిగ మించవచ్చు.
  • శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఉల్లిలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణలో ఉంచు తుంది. తద్వారా మధుమేహా వ్యాధి రాకుండా కాపాడుతుంది.
  • నరాల వ్యవస్థని పటిష్టపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • రోజూ ఉల్లిని తీసుకుంటే గుండె సంబంధింత వ్యాధులు దరిచేరవు.
  • యాంటీ బయోటిక్‌గా, యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
  • మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజు ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి.
  • ఉల్లిపాయల రసం, తేనె సమంగా కలిపి వేడి చేసి ప్రతి ఉదయం తీసుకుంటే వీర్యపుష్టి కలుగుతుంది.
  • ఉల్లి రసానికి తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలర్జీలు సులువుగా తగ్గిపోతాయి.

Comments

comments