Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘గూఢచారి’ టీజర్ రిలీజ్…

Gudachari-image

సినిమా: శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభిత ధూళిపాళ హీరో హీరోయిన్లుగా వస్తున్న సిన్మా గూఢచారి.  అభిషేక్ పిక్చర్స్… విస్టా డ్రీమ్ మర్చంట్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా ఈ సిన్మాను నిర్మించారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ముఖ్య పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎమోషన్  రొమాన్స్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారనే  విషయం ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో సుప్రియ యార్లగడ్డ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Comments

comments