Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

విభిన్నమైన భావోద్వేగాలతో..

Goodachariఅడివిశేష్, శోభితా ధూళిపాళ హీరోహీరోయిన్లుగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’.  అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “శేష్ సినిమాలపై ఆసక్తితో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. అతను ‘క్షణం’ తర్వాత చేసిన చిత్రమిది. 160 రోజుల్లో 168 లొకేషన్స్‌లో ఈ సినిమాను షూట్ చేయడం గొప్ప విషయం”అని చెప్పారు. అడివిశేష్ మాట్లాడుతూ “నేను, శశికిరణ్, రాహుల్ కలిసి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే తయారుచేశాం. శశి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. శోభిత చక్కగా నటించింది. సుప్రియ 22 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో నా చిన్నప్పటి పాత్రను కృష్ణ మనవడు,  సుధీర్‌బాబు తనయుడు చేశాడు. ఈ సినిమాను హిందీ, తమిళంలోనూ రీమేక్ చేయాలనుకుంటున్నాం”అని అన్నారు. దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ “స్క్రిప్ట్ రాయడానికి మధ్యలో అబ్బూరి రవిని కలిసేవాళ్లం. ఆయన దగ్గర రియల్ ఫిలిం స్కూల్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ప్రతి సన్నివేశాన్ని మెరుగ్గా ఎలా రాయవచ్చో అనేది ఆయన నేర్పిస్తూ మంచి మాటలు ఇచ్చారు. శ్రీచరణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు”అని తెలిపారు. శోభిత దూళిపాళ మాట్లాడుతూ “తెలుగులో నా మొదటి చిత్రమిది. ఓ మంచి టీమ్‌తో పనిచేశాననే ఫీలింగ్ కలిగింది. సినిమాలో విభిన్నమైన భావోద్వేగాలు ఉన్నాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ సుంకర, కోన వెంకట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments